షర్మిల చేసిన తప్పిదం అదే: విజయసాయి రెడ్డి
- ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేరడం ఆమె చేసిన రాజకీయ తప్పిదమన్న వైసీపీ నేత
- జగన్‌తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమేనన్న విజయసాయి
- 2014లోనే వైసీపీకి ఎన్‌డీఏలో చేరమని ఆఫర్ వచ్చిందని వెల్లడి
- తాము కాదన్నాకే టీడీపీతో బీజేపీ జతకట్టిందని స్పష్టీకరణ
ఇక ఎన్‌డీఏలో వైసీపీ చేరికపై కూడా ఆయన మాట్లాడుతూ.. 2014లోనే తమకు ఆ ఆఫర్ వచ్చిందన్నారు. తాము తిరస్కరించిన తర్వాతే టీడీపీతో బీజేపీ జతకట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఏ పార్టీతో జతకట్టే ప్రసక్తే లేదన్నారు. గతంలో కొన్ని అంశాలవారీగానే తాము ఎన్‌డీఏకి మద్దతు ఇచ్చామన్నారు.
అలాగే వాలంటీర్ల విషయంలో తన మాటలను వక్రీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తు చేశారు. వాలంటీర్లు తమ కార్యకర్తలని తాను అనలేదని, తమ ప్రభుత్వం నియమించిన వారు అని మాత్రమే చెప్పానన్నారు.