దినేశ్‌ కార్తీక్‌ను సరదాగా ఆటపట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దినేశ్‌ కార్తీక్‌ను సరదాగా ఆటపట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్!

Rohit Sharma playfully teases Dinesh Karthik during MI vs RCB clash
  • వాంఖ‌డేలో ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
  • బెంగ‌ళూరు ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో దినేశ్ కార్తీక్ విజృంభ‌ణ‌
  • రివర్స్ స్కూప్ షాట్ల‌తో బౌండ‌రీలు బాదిన సీనియ‌ర్ బ్యాట‌ర్‌
  • శ‌భాష్ కార్తీక్‌ అంటూ స‌ర‌దాగా టీజ్ చేసిన హిట్‌మ్యాన్‌
వాంఖ‌డే మైదానంలో గురువారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట‌గాడు దినేశ్ కార్తీక్ కేవలం 23 బంతుల్లోనే అజేయంగా 53 పరుగులు చేశాడు. ఇలా త‌న‌ అద్భుతమైన ఆటతీరుతో వాంఖడే స్టేడియంలో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అతని ఈ అద్భుతమైన ఇన్నింగ్సే ఆర్‌సీబీ 196 పరుగుల భారీ స్కోర్ చేయ‌డానికి దోహదపడింది. అయినా బెంగ‌ళూరుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. 

ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ సమయంలో కార్తీక్‌ను ముంబై మాజీ సార‌ధి రోహిత్ శర్మ సరదాగా ఆటపట్టించాడు. బెంగ‌ళూరు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఆకాశ్ మధ్వల్ బౌలింగ్‌లో బౌండరీల కోసం కార్తీక్ రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు. అలా స్కూప్ షాట్ల‌తో అత‌డు నాలుగు బౌండరీలు బాది ప్రేక్షకుల‌కు వినోదం పంచాడు. 

ఈ స‌మ‌యంలో కార్తీక్‌ను రోహిత్ స‌ర‌దాగా టీజ్ చేయ‌డం జ‌రిగింది. "శ‌భాష్ డీకే.. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఖేల్నా హై అభీ (అద్భుతం డీకే.. మీరు ప్రపంచ కప్ ఆడాలి)" అని అన్నాడు. హిట్‌మ్యాన్ మాట‌లు స్టంప్స్ వెనుక ఉండే మైక్‌ల‌లో రికార్డ‌య్యాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మ‌ల్లో వైర‌ల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్దేశించిన‌ 197 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా 27 బంతులు మిగిలి ఉండ‌గానే ముంబై ఛేదించిన విష‌యం తెలిసిందే.
Advertisement
IPL 2024
Rohit Sharma
Dinesh Karthik
MI vs RCB
Cricket
Sports News

More Telugu News