Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

షార్ట్స్‌లో చూడండి
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు.
Go Back to Shorts
Phone Tapping Case
Telangana
Congress

More Telugu News