తెలంగాణ ప్రగతిలో మహాత్మా ఫూలే స్ఫూర్తి ఇమిడి ఉంది: కేసీఆర్
- బహుజన కులాలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఘనమైన నివాళి అన్న మాజీ సీఎం
- గత ప్రభుత్వంలో పదేళ్లు వివిధ కార్యక్రమాలు చేపట్టామని ప్రస్తావన
- బహుజన బాంధవుడు ఫూలే 198వ జయంతి సందర్భంగా స్పందించిన బీఆర్ఎస్ అధినేత
తమ పదేళ్ల పాలనాకాలంలో అమలైన పథకాలు, కార్యాచరణ, బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిందని, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తి కార్యాచరణ మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఒకనాడు అల్ప దృష్టితో, నిర్లక్య ధోరణులతో, వెనకబడిన సమాజంగా తెలంగాణను చూశారని, ఉద్యమ కాలం నుంచి రగిలిన సబ్బండ వర్గాల చైతన్యం నూతన రాష్ట్రంలో ప్రగతి పథంలో ముందడుగు వేసిందని కేసీఆర్ అన్నారు. ఈ మొత్తం క్రమంలో మహాత్మా ఫూలే స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.