ఒకే ఫ్రేమ్‌లో త‌ళుక్కున మెరిసిన సానియా మీర్జా, స్మితా స‌బ‌ర్వాల్‌.. నెట్టింట ఫొటోల వైర‌ల్‌!

Smita Sabharwal Ramzan Celebrations with Sania Mirza
  • రంజాన్ సంద‌ర్భంగా సానియా మీర్జాను క‌లిసిన స్మితా స‌బ‌ర్వాల్‌
  • ఆ స‌మ‌యంలో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టా వేదిక‌గా పంచుకున్న ఐఏఎస్ ఆఫీస‌ర్‌
  • ఈద్ ముబార‌క్ హైద‌రాబాదీస్ అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన స్మిత
రంజాన్ పండ‌గ సంద‌ర్భంగా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఐఏఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ క‌లుసుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సానియాతో కలిసి దిగిన ఫొటోల‌ను స్మిత త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. #ఈద్ ముబార‌క్, #రంజాన్ ముబార‌క్‌, #హైద‌రాబాదీస్ వంటి హ్యాష్ ట్యాగుల‌తో ఫొటోల‌ను ఐఏఎస్ ఆఫీస‌ర్ పంచుకున్నారు. ఇక ఒకే ఫ్రేమ్‌లో త‌ళుక్కున మెరిసిన సానియా, స్మితల‌ను చూసిన‌ నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.     


Go Back to Shorts
Ramzan Celebrations
Smita Sabharwal
Sania Mirza

More Telugu News