కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాలలో అపశ్రుతి .. 15 మంది పిల్లలకు విద్యుత్ షాక్
- చిన్నటేకూరులో ఉగాది ప్రభ లాగుతుండగా ఘటన
- హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి పిల్లల తరలింపు
- ఎమర్జెన్సీ యూనిట్ లో చేర్చి చికిత్స అందిస్తున్న వైద్యులు
కాగా, సంతోషంగా పండుగ జరుపుకుంటున్న చిన్నారులు విద్యుత్ షాక్ కు గురవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటి వరకు ఆనందంతో గంతులేసిన చిన్నారులు ఇంతలోనే గాయాలపాలై ఆసుపత్రి బెడ్ మీద పడుకున్నారంటూ రోదిస్తున్నారు. విద్యుత్ షాక్ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక నేతలు జీజీహెచ్ కు వచ్చి పిల్లల తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.