నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం.. పురందేశ్వరి పాల్గొనే అవకాశం!
- ఈ సాయంత్రం తణుకు, నిడదవోలులో బహిరంగసభలు
- తణుకుకు వేర్వేరు హెలికాప్టర్లలో చేరుకోనున్న బాబు, పవన్
- తణుకు నుంచి నిడదవోలుకు రోడ్డు మార్గంలో పయనం
ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సభ పూర్తయిన తర్వాత నిడదవోలు తిరుమల సాయి కల్యాణ మంటపంలో... పవన్ కల్యాణ్ రాజమండ్రిలోని షెల్టాన్ హోటల్ లో బస చేస్తారు. రేపు ఉదయం నిడదవోలులో ఉభయగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.