వావ్‌.. ర‌వి బిష్ణోయ్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌!

Ravi Bishnoi Stunning Catch Video goes Viral on Social Media
  • గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో త‌న బౌలింగ్‌లో అద్భుత‌మైన రిట‌ర్న్ క్యాచ్ ప‌ట్టిన బిష్ణోయ్‌
  • ర‌వి బిష్ణోయ్ క్యాచ్‌తో పెవిలియ‌న్‌కు కేన్ విలియ‌మ్స‌న్‌
  • గుజ‌రాత్ ఇన్నింగ్స్‌ 8వ ఓవ‌ర్‌ రెండో బంతికి యువ స్పిన్న‌ర్ అద్భుతం
  • ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్
గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) తో ఆదివారం జ‌రిగిన మ్యాచులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. త‌న బౌలింగ్‌లో అద్భుత‌మైన రిట‌ర్న్ క్యాచ్‌తో గుజ‌రాత్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్‌ను అవుట్ చేశాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో ఇలా బిష్ణోయ్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఓవ‌ర్ రెండో బంతిని ఈ యువ స్పిన్న‌ర్‌ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వేశాడు. 

ఆ బంతిని కేన్ మామ స్ట్రైట్‌గా ఆడి సింగిల్ తీయాల‌ని చూశాడు. కానీ, బంతి కాస్త గాల్లోకి లేచింది. దాంతో బిష్ణోయ్ త‌న కుడివైపు గాల్లోకి ఎగిరి ఒకే చేతితో అద్భుత‌మైన రిట‌ర్న్ క్యాచ్ తీసుకున్నాడు. అంతే.. ఒక్క‌సారిగా గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. బిష్ణోయ్ అందుకున్న ఆ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో విలియ‌మ్స‌న్ కూడా నిర్ఘాంత‌పోయాడు. ఇప్పుడు ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఐపీఎల్ హిస్ట‌రీలో అత్యుత్త‌మ క్యాచుల‌లో ఇది ఒక‌టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ర‌వి బిష్ణోయ్ అందుకున్న‌ స్ట‌న్నింగ్ క్యాచ్‌పై మీరు ఓ లుక్కేయండి.
Go Back to Shorts
Ravi Bishnoi
Stunning Catch
Viral Videos
Social Media

More Telugu News