రాయితీ ఎత్తేసి ప్రయాణికులకు షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో
- రూ.59 హాలిడే కార్డును రద్దు చేసిన అధికారులు
- ఉదయం, రాత్రి వేళల్లో 10 శాతం రాయితీకి మంగళం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
అయితే, రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలామంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికే మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.