తుక్కుగూడ కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం
- ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండానే మళ్లీ కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరమని వ్యాఖ్య
- కాంగ్రెస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్న కిషన్ రెడ్డి
- దమ్ముంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై రాహుల్ గాంధీ చర్చకు రావాలని సవాల్
దేశంలో ప్రతి మహిళకు రూ.1 లక్ష ఇస్తామని చెబుతున్నారని, మొదట తెలంగాణలో ఇచ్చిన రూ.4వేల నిరుద్యోగ భృతి, పేదింటి మహిళకు నెలకు రూ.2,500 హామీలు అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తుంటే ఉట్టికి ఎగరలేనివాడు ఆకాశానికి ఎగిరినట్లుగా ఉందన్నారు. రాహుల్ గాంధీకి ఏమాత్రం అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.