YS Avinash Reddy: మనిషిగా పుట్టాక కొంచెం ఆలోచించి మాట్లాడాలి: షర్మిల వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన అవినాశ్ రెడ్డి

MP Avinash Reddy reacts on Sharmila remarks
షార్ట్స్‌లో చూడండి
వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.

మసి పూస్తారు, బురద చల్లుతారు... వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు... వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా... దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి... నాకెలాంటి అభ్యంతరం లేదు... కానీ మనిషిగా పుట్టాక కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి... కొంచెమైనా ఇంగితజ్ఞానం ఉండాలి అంటూ హితవు పలికారు.
Go Back to Shorts
YS Avinash Reddy
Sharmila
YS Vivekananda Reddy
YSRCP
Congress
Kadapa

More Telugu News