Texas temple sued: టెక్సాస్ లో గుడికి వెళ్లిన కొడుకుకు వాతలు పెట్టిన పూజారులు.. 8 కోట్లకు తండ్రి దావా

Temple in Texas sued for 1 million dollor for branding 11 year old
  • షుగర్ ల్యాండ్ లోని అష్టలక్ష్మి ఆలయంలో గతేడాది ఘటన
  • నొప్పితో, అనారోగ్యంతో బాధపడ్డాడని తండ్రి ఆవేదన
  • జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను కోర్టుకు లాగిన బాధితుడి తండ్రి
ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన కొడుకుకు పూజారులు వాతలు పెట్టారని ఇండియన్ అమెరికన్ విజయ్ కోర్టుకెక్కాడు. ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి పదకొండేళ్ల తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని చెప్పాడు. దీనివల్ల బాబు రోజుల తరబడి నొప్పితో బాధపడ్డాడని, తాము ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శరీరంపై ఆ గుర్తులు జీవితాంతం చెరిగిపోవని చెబుతూ.. పరిహారంగా 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.
 
ఇదీ జరిగింది..
టెక్సాస్ రాష్ట్రం షుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో 2023లో జీయర్ సంస్థ ఓ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పదకొండేళ్ల బాలుడి భుజంపై విష్ణువు చిహ్నాలు శంఖు చక్రాలను కాల్చిన ఇనుప కడ్డీతో వేశారు. దీనివల్ల తన కొడుకు ఎంతో బాధను అనుభవించాడని బాలుడి తండ్రి, భారత సంతతకి చెందిన విజయ్ చెప్పారు. దీనిపై ఆయన కోర్టుకెక్కారు. తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారని, పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ లాయర్ కోర్టులో వాదించాడు. కాగా, ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ వర్గాలు కానీ స్పందించలేదు.

Texas temple sued
minor boy
jiyyar trust
america
1 million dollors
Texas court

More Telugu News