భారత్‌లో ఉగ్ర చర్యలకు పాల్పడితే వదిలిపెట్టం.. పాక్‌లోకి ప్రవేశించి మరీ చంపేస్తాం: రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక
- పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటామన్న రక్షణమంత్రి
- ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ పదేపదే కవ్విస్తే వదిలేది లేదని హెచ్చరిక
- ఉగ్రవాదులను హెచ్చరించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
విస్తృత ప్రణాళికలో భాగంగా విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తోందని, 2020 నుంచి పాకిస్థాన్‌లో 20 మందిని మట్టుబెట్టిందంటూ బ్రిటన్‌కు చెందిన ‘గార్డియన్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించేందుకు నిరాకరించింది. కాగా 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
కెనడా, అమెరికాలోని ఖలిస్థానీ టెర్రిరిస్టులను భారత్ చంపేస్తోందని, అంతమొందించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల తర్వాత గార్డియన్ పత్రికలో ఈ కథనం వెలువడింది. ఈ ఏడాది ఆరంభంలో తమ భూభాగంపై ఇద్దరు పౌరుల హత్యలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని పాకిస్థాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయితే పాక్ చేసిన ఈ ప్రకటనను భారత్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని తిప్పికొట్టింది.