ఉప్పల్ స్టేడియంకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసం టీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు
- ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు సీఎస్కే, ఎస్ఆర్హెచ్ మ్యాచ్
- ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని వెల్లడి
- 'ఎక్స్' వేదికగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన
"క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి! ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎల్ మ్యాచ్కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ను వీక్షించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది" అని సజ్జనార్ తన ట్వీట్లో పేర్కొన్నారు.