'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్
- నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ
- హేషం అబ్దుల్ వహబ్ బాణీలు
శుక్రవారం రష్మిక పుట్టిన రోజు సందర్భంగా మొదట ఈ మూవీ టీజర్ విడుదల కావాల్సింది. కానీ, అనివార్యకారణాల వల్ల టీజర్ విడుదల వాయిదా పడింది. దాంతో చిత్రం యూనిట్ పోస్టర్‌తో సరిపెట్టింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీతో పాటు 'రెయిన్బో', 'పుష్ప-2' చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఆమె చివరి చిత్రం 'యానిమల్' బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.