సీఎం జగన్ పై వ్యాఖ్యలు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు
- మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో పాల్గొన్న చంద్రబాబు
- సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సీఈవోకు వైసీపీ నేతల ఫిర్యాదు
- ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం నేడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచార యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31న ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగళం సభలకు హాజరయ్యారు.