కవిత బెయిల్ పిటిషన్ 4వ తేదీకి వాయిదా
- సుదీర్ఘ వాదనలు వినిపించిన ఇరువైపుల న్యాయవాదులు
- ఈడీ రిప్లై రిజాయిండర్‌కు సమయం కోరిన కవిత తరఫు న్యాయవాదులు
- 3వ తేదీ సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడి
ఈడీ రిప్లై రిజాయిండర్‌కు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. గురువారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేపట్టనుంది.