కేసీఆర్ మాదిరి కేఏ పాల్ అబద్ధాలు చెప్పరు.. బీజేపీ నేతలు నన్ను మోసం చేశారు: బాబూ మోహన్
- ప్రజాశాంతి పార్టీ తరపునే పోటీ చేస్తానన్న బాబూ మోహన్
- వరంగల్ ప్రజలు తనను గెలిపించాలని విన్నపం
- అందరూ శెభాష్ అనేలా ప్రజలకు సేవ చేస్తానని హామీ
ప్రజాశాంతి పార్టీ నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తానని బాబూ మోహన్ తెలిపారు. తాను వేరే పార్టీ నుంచి పోటీ చేస్తానని కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. చీప్ రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజలు తనను గెలిపించాలని... అందరూ శెభాష్ అనేలా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదిరి తమ అధినేత కేఏ పాల్ అబద్ధాలు చెప్పరని అన్నారు. టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని విమర్శించారు. తాను గెలిచిన తర్వాత పేదలందరికీ పింఛన్లు ఇప్పిస్తానని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తానని అన్నారు.