తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
- 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 30.50 తగ్గింపు
- ఢిల్లీలో ప్రస్తుతం కమర్షియల్ సిలండర్ ధర రూ. 1764.50
- 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర కూడా రూ. 7.50 తగ్గిన వైనం
- గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలు యథాతథం
ఇదిలాఉంటే.. ఇంధన ధరలు, మార్కెట్ డైనమిక్స్‌లో చోటు చేసుకునే హెచ్చుతగ్గుల కారణంగా గ్యాస్ ధరలలో సవరణలు జరుగుతుంటాయి. ఫిబ్రవరి 1న ఇండేన్ గ్యాస్ సిలిండర్ల ధరలు మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక్కొక్కటి ఒక్కో రేట్లు ఉన్నాయి.
అయితే, మార్చి 1వ తేదీ రాగానే అన్ని మెట్రో నగరాల్లో ఇండేన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక ధరల తగ్గుదల వెనుక ఉన్న కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, అంతర్జాతీయ చమురు ధరలలో మార్పులు, పన్నుల విధానాలలో మార్పులు, సరఫరా-డిమాండ్ వంటి వివిధ అంశాలు అటువంటి సవరణలకు దోహదం చేస్తుంటాయనేది మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట.