చెప్పు విసరడం భావ ప్రకటన స్వేచ్ఛే.. నాటి డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యల వీడియో వైరల్
- గతంలో చంద్రబాబుపై దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించిన గౌతం సవాంగ్
- ఆ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్
- జగన్‌పై చెప్పు విసిరడం కూడా భావప్రకటన స్వేచ్చేనంటూ నెటిజన్ల కామెంట్
ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసిరారు. ఈ నేపథ్యంలో గతంలో గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చెప్పు విసరడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందికే వస్తుందని భాష్యం చెబుతున్నారు.