నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'రాబిన్ హుడ్' నుంచి గ్లింప్స్.. ఈసారి ట్విస్ట్ అదిరింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'రాబిన్ హుడ్' నుంచి గ్లింప్స్.. ఈసారి ట్విస్ట్ అదిరింది!

Nitin Birthday Special Glimpse from Robinhood
  • ఏజెంట్ 'రాబిన్ హుడ్' అంటూ అసలు క్యారెక్టర్‌ను రివీల్ చేసిన యూనిట్‌
  • ఇంత‌కుముందు టైటిల్ గ్లింప్స్‌లో హీరోను దోపిడీలు చేస్తున్న‌ట్లు చూపించిన వైనం
  • ఆస‌క్తిక‌రంగా 'రాబిన్ హుడ్' స్పెషల్ గ్లింప్స్ 
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.. జీవీ ప్రకాశ్ బాణీలు
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. శ‌నివారం నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుద‌ల చేసింది. ఈ స్పెషల్ గ్లింప్స్ ద్వారా చిత్ర బృందం ఒక ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఏజెంట్ 'రాబిన్ హుడ్' అంటూ అసలు క్యారెక్టర్‌ను రిలీజ్ చేసింది. చివరిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. అందులో నితిన్ డబ్బు కోసం దోపిడీలు చేస్తున్న‌ట్లు చూపించారు. 

తాజాగా విడుద‌లైన గ్లింప్స్‌లో మాత్రం ఏజెంట్ అని అన్నారు. మరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నితిన్.. దోపిడీలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ట్విస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఇక‌ ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండ‌గా, జీవీ ప్రకాశ్ బాణీలు అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే నితిన్‌, వెంకీ కాంబోలో 'భీష్మ' చిత్రం వచ్చి భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ‘రాబిన్ హుడ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
Robinhood
Nitin
Venky Kudumula
Tollywood

More Telugu News