Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెరుపులాంటి మెహ్రీన్ ఏమైపోయినట్టు?

Mehreen Special
Advertisement
  • గ్లామరస్ హీరోయిన్ గా  మెహ్రీన్ కి క్రేజ్ 
  • ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్ కొట్టిన బ్యూటీ
  • వ్యక్తిగత కారణాల వలన వచ్చిన గ్యాప్ 
  • పుంజుకోలేకపోతున్న మెహ్రీన్

Advertisement
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెరపై తెల్లగులాబీలా విరిసిన మెహ్రీన్ ను చూసి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. తమన్నా తరువాత ఆ స్థాయి మేనిఛాయ కలిగిన బ్యూటీగా అంతా చెప్పుకున్నారు. ఇక ఈ సుందరి హవా కొనసాగడం ఖాయమని అనుకున్నారు.

అనుకున్నట్టుగానే ఆ తరువాత చేసిన రెండు సినిమాలతో కూడా ఆమె విజయాలను అందుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువమంది హీరోయిన్స్ కి మాత్రమే హ్యాట్రిక్ హిట్ పడుతూ ఉంటుంది. అలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నవారి జాబితాలోకి మెహ్రీన్ చేరిపోయింది. 'ఎఫ్ 2' సినిమాతో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.

ఆ తరువాత వ్యక్తిగత కారణాల వలన ఆమె తన కెరియర్ ను కొనసాగించాలా .. లేదా అనే ఒక డైలమాలో పడిపోయింది. కెరియర్ ను కొనసాగించాలానే నిర్ణయానికి రావడంలో ఆమె ఆలస్యం చేసింది. ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చిన తరువాత పుంజుకోవడం చాలా కష్టమవుతుందనే సత్యాన్ని చాలామంది అనుభవపూర్వకంగా చెప్పేమాట. మెహ్రీన్ విషయంలోనూ అదే జరిగింది. 

అయితే మెహ్రీన్ చకచకా తేరుకునే దిశగా అడుగులు వేసింది. 'మంచిరోజులొచ్చాయి' వంటి చిన్న సినిమాను సైతం చేసింది. కానీ అప్పటికే చాలామంది కొత్త హీరోయిన్స్ దూసుకుని వచ్చేశారు. అందువలన మెహ్రీన్ కి తాను వదిలేసిన ప్లేస్ దొరకడం కష్టమే అయింది. కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించడం లేదు. ఇతర భాషల్లోను సందడి కనిపించడం లేదు. మెహ్రీన్ ఏమైపోయిందబ్బా? అనుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో శోధిస్తున్నారు. 
Advertisement
Advertisement
Mehreen
Actress
Tollywood

More Telugu News