సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వాహనం... వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి వ్యతిరేక మార్గంలో వచ్చిన కంటైనర్
- సందేహాలు వ్యక్తం చేసిన నారా లోకేశ్
- లోకేశ్ కు అంతకుమించి సంస్కారం ఎలా వస్తుందన్న వైవీ సుబ్బారెడ్డి
- అది ఫర్నిచర్ తో కూడిన కంటైనర్ అని వెల్లడి
ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కంటైనర్ వాహనంలో ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ ఉందని వెల్లడించారు. అయితే, విపక్ష నేతలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ నారా లోకేశ్ బంధువులకు చెందినదని, అందుకే ఏ కంటైనర్ చూసినా వారికి అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిలో మంత్రి పదవిలోకి వచ్చిన లోకేశ్ కు అంతకుమించి సంస్కారం ఎలా ఉంటుంది? అని వైవీ విమర్శించారు.