నేపాల్ మేయర్ కూతురు గోవాలో మిస్సింగ్

Nepal Mayors daughter missing in Goa
  • గోవా ప్రజల సాయం కోరిన నేపాల్ మేయర్ గోపాల్
  • సోషల్ మీడియాలో వీడియో ద్వారా అభ్యర్థన
  • కొన్ని నెలలుగా గోవాలో ఉంటోందని వెల్లడి
మెడిటేషన్ కోసం ఇండియా వచ్చిన నేపాల్ మేయర్ కూతురు గోవాలో కనిపించకుండా పోయింది. కూతురు స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్న ధంగధి సిటీ మేయర్ గోపాల్ హమాల్.. సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. తన కూతురు ఆరతి హమాల్ ఓషో మెడిటేషన్ ఫాలోవర్ అని, మెడిటేషన్ కోసం కొన్ని నెలలుగా గోవాలోనే ఉంటోందని తెలిపారు. అయితే, గత సోమవారం రాత్రి నుంచి ఆరతి కనిపించడంలేదని ఆమె స్నేహితురాలు ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇచ్చిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పిన గోపాల్.. గోవా ప్రజల సాయం కోరారు.

ఆరతి హమాల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ మొబైల్ ఫోన్ నెంబర్లను పోస్టు చేశారు. కనిపించకుండా పోయిన పెద్ద కూతురు ఆరతి హమాల్ ను వెతికేందుకు తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయలుదేరారని చెప్పారు. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా ఫోన్ చేసి చెప్పాలని గోపాల్ హమాల్ వీడియోలో అభ్యర్థించారు. కాగా, ఆరతి హమాల్ మిస్సింగ్ కు సంబంధించి ఫిర్యాదు అందిందని, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామని గోవా పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Nepal Women
Missing In Goa
Nepal Mayor
Osho medidation
Video Request
Searching

More Telugu News