టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ... వివరాలు ఇవిగో!

Manda Krisha met TDP Chief Chandrababu
  • చంద్రబాబు నివాసానికి వచ్చిన మంద కృష్ణ
  • చంద్రబాబుకు 35 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేత
  • ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటన
  • జగన్ మాదిగలను మోసం చేశాడని విమర్శలు
  • చంద్రబాబు మాదిగలకు 14 సీట్లు ఇచ్చాడని కితాబు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. చంద్రబాబును కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంద కృష్ణ ఈ సందర్భంగా 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు అందజేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయించినట్టు మంద కృష్ణ వెల్లడించారు. సీట్ల కేటాయింపులో జగన్ మాదిగలను మోసం చేశారని మండిపడ్డారు. కానీ, చంద్రబాబు మాదిగలకు 14 సీట్లు కేటాయించారని కొనియాడారు.
Go Back to Shorts
Manda Krishna Madiga
Chandrababu
TDP
NDA
Andhra Pradesh

More Telugu News