ఇది ముమ్మూటికీ జగన్ సర్కారు చేసిన హత్యే: నారా లోకేశ్
- రాజంపేట నియోజకవర్గంలో ఓ కుటుంబం బలవన్మరణం
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
- బీసీలపై జగన్ అండతోనే దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం
తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతో ఆ చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని లోకేశ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యేనని మండిపడ్డారు. ఆ కుటుంబానికి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీసీలపై జగన్ అండతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ మూకలను చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు.