లోకేశ్ కాన్వాయ్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు

Police search in Nara Lokesh convoy
  • ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసుల తనిఖీలు
  • కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్నామని లోకేశ్ కు చెప్పిన పోలీసులు
  • తనిఖీలకు పూర్తిగా సహకరించిన లోకేశ్
మంగళగిరి నియోజకవర్గంలోని గ్రామాల్లో రచ్చబండకు వెళ్తున్న టీడీపీ యువనేత నారా లోకేశ్ కాన్వాయ్ ను పోలీసులు ఆపారు. ఆయన కారును తనిఖీ చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో లోకేశ్ కాన్వాయ్ అటువైపు వచ్చింది. దీంతో ఆయన కాన్వాయ్ ను ఆపిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్నట్టు లోకేశ్ కు పోలీసులు చెప్పారు. దీంతో, పోలీసులకు లోకేశ్ పూర్తిగా సహకరించారు. తనిఖీల సందర్భంగా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా కాన్వాయ్ లో ఏమీ లేదని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి లోకేశ్ కాన్వాయ్ ముందుకు బయల్దేరింది. 

Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Convoy
Police
Search

More Telugu News