సికింద్రాబాద్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
- ముఖ్యనేతలతో చర్చించి అందరి అభిప్రాయం సేకరించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
- ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా పద్మారావు గౌడ్
- సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన నేత అన్న బీఆర్ఎస్
సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.