ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం
- ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత
- బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో ఘటన
- భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
- నాలుగు రోజుల క్రితమే చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్
- ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతం
ఈ ఘటన బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు నక్సలైట్ల వివరాలను అధికారులు వెల్లడించలేదు.
ఇదిలాఉంటే.. నాలుగు రోజుల క్రితం కూడా ఛత్తీస్‌గఢ్‌లోని చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.