ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

High Court notices to Khairatabad MLA Danam Nagendar
  • ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేశారంటూ విజయారెడ్డి పిటిషన్
  • డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని... కేసులు కూడా నమోదయ్యాయని వాదనలు వినిపించిన లాయర్
  • భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను కూడా నామినేషన్ పత్రాల్లో ఇవ్వలేదని కోర్టుకు తెలిపిన విజయారెడ్డి
  • నోటీసులు జారీ చేసి... తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసిన హైకోర్టు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విజయారెడ్డి తరఫున సుంకర నరేశ్ వాదనలు వినిపించారు.

ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని సుంకర నరేశ్ వాదనలు వినిపించారు. అలాగే దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు. వీటిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.
Go Back to Shorts
danam nagendar
Congress
vijayareddy
BRS

More Telugu News