Heavy Rains: తమిళనాడులోని పలు ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షం

  • ఈ ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • వచ్చే ఐదు రోజులు రాయలసీమ, కేరళలలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందన్న ఐఎండీ
Heavy rain lashes parts of Tamil Nadu

భారీ వర్షం ఈ ఉదయం తమిళనాడులోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. నిన్న చెదురుమదురుగా కురిసిన వర్షం నేడు భారీగా పడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక పాదచారుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ట్రాఫిక్ కష్టాలైతే చెప్పక్కర్లేదు. 

తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రాయలసీమ, కేరళలో తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర ప్రాంతాల్లోనూ వచ్చే రెండు రోజుల్లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందని వివరించింది.

More Telugu News