Allu Arjun: తొలి ద‌క్షిణాది న‌టుడిగా అల్లు అర్జున్ సెన్సేష‌న‌ల్ రికార్డు!

  • బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు
  • ఐకాన్ స్టార్ తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్, దుల్క‌ర్ స‌ల్మాన్, య‌శ్
  • ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు ఇన్‌స్టాలో 13.4 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు
Allu Arjun creates a sensational record

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేష‌న‌ల్ రికార్డు సాధించాడు. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న తొలి ద‌క్షిణాది న‌టుడిగా రికార్డుల‌కెక్కాడు. ఐకాన్ స్టార్ తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ (21.3 మిలియ‌న్లు), రామ్ చ‌ర‌ణ్ (20.8 మిలియ‌న్లు), దుల్క‌ర్ స‌ల్మాన్ (14.1 మిలియ‌న్లు), య‌శ్ (13.5 మిలియ‌న్లు), మ‌హేశ్ బాబు (13.4 మిలియ‌న్లు), ప్ర‌భాస్ (11.7 మిలియ‌న్లు), ద‌ళ‌ప‌తి విజ‌య్ (10.8 మిలియ‌న్లు) లకు ఫాలోవ‌ర్లు ఉన్నారు. 

ఇక అల్లు అర్జున్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'పుష్ప‌-2' మూవీలో న‌టిస్తున్నాడు. 'పుష్ప‌: ది రైజ్‌' కు సీక్వెల్‌గా ఈ చిత్రం వ‌స్తోంది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ మూవీ ఆగ‌స్టు 15వ తేదీన థియేట‌ర్ల‌లోకి రానుంది. 'పుష్ప‌-2' త‌ర్వాత ఐకాన్ స్టార్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, సందీప్ రెడ్డి వంగాల‌తో సినిమాలు చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. కాగా, పుష్ప సినిమాలోని న‌ట‌న‌కు గాను బ‌న్నీ జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

More Telugu News