ఈడీ సమన్లపై మళ్లీ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
- వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తొమ్మిదిసార్లు సమన్లు జారీ
- కోర్టులో విచారణ జరుగుతున్నపుడు సమన్లు పంపడంపై ఢిల్లీ సీఎం అభ్యంతరం
వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు ఇతరత్రా అంశాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాలని పేర్కొంటూ ఈడీ తొమ్మిదోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న విచారణకు రమ్మని కేజ్రీవాల్ ను పిలిచింది. దీంతో కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ ఆరోపణలకు ఈడీ సమాధానం చెప్పాలని ఆదేశించింది.