Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజువల్స్ తోనే 'ఔరా' అనిపిస్తూ దూసుకుపోతున్న 'కంగువా' టీజర్!

Kanguva Teasr Special
Advertisement
  • సూర్య కథానాయకుడిగా రూపొందుతున్న 'కంగువా'
  • పూర్తిగా వేరే కాలంలో నడిచే కథ 
  • సూర్య కెరియర్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే
  • 38 భాషల్లో విడుదల కానున్న సినిమా 
  • గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసిన కంటెంట్  

Advertisement
సూర్య కథానాయకుడిగా 'కంగువా' సినిమా రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి, నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరగకుండా ఉండటం అసాధ్యమేనని చెప్పాలి. టీజర్ తో ఈ సినిమాను గురించి అంతా మాట్లాడుకునేలా చేయాలనే టీమ్ ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. 

నాయకుడి వైపు నుంచి .. ప్రతి నాయకుడి వైపు నుంచి ఈ టీజర్ ను కట్ చేశారు. గుర్రాలపై .. పడవలపై పోరాట సన్నివేశాలు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. పంచభూతాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నారేమో, అందుకు తగినట్టుగా నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలి సంబంధింతమైన విజువల్స్ తో ఈ టీజర్ ను వదిలారు. కాస్ట్యూమ్స్ ను .. ఆయుధాలను డిజైన్ చేసిన తీరు, లొకేషన్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తున్నాయి.

విజువల్స్ పరంగా సినిమాపై అంచనాలు పెంచేలా టీజర్ తోనే మంచి మార్కులు కొట్టేశారు. అందువల్లనే ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. గ్రాఫిక్స్ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తోంది. కెమెరా పనితనం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. సూర్య కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా .. అత్యధిక భాషల్లో విడుదల కానున్న సినిమా ఇదే కావడం విశేషం. కథానాయికగా దిశా పటాని సందడి చేయనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో బాబీ డియోల్ .. జగపతిబాబు .. యోగిబాబు కనిపించనున్నారు. 
Advertisement
Advertisement
Kanguva
Surya
Disha Patani
Jagapathi Babu

More Telugu News