జగిత్యాల సభలో ప్రధాని మోదీ 'శక్తి' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు

  • రాహుల్ గాంధీ 'శక్తి' వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్రమోదీ వక్రీకరించారని ఫిర్యాదు
  • ప్రధాని మోదీ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయన్న కాంగ్రెస్ నేతలు
  • రాహుల్ గాంధీపై ఉద్దేశ్యపూర్వకంగా అబద్దపు ప్రచారం చేశారన్న భట్టివిక్రమార్క
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 'శక్తి' వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్రమోదీ వక్రీకరించారని, ఆయన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. భారత్ న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ 'శక్తి'పై చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని... వాటిని ప్రధాని వేరే అర్థం వచ్చేలా జగిత్యాల సభలో చెప్పారని ఆరోపించారు. ఈ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు గాను చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని వక్రీకరించారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై ఉద్దేశ్యపూర్వకంగా అబద్దపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.

Narendra Modi
Rahul Gandhi
Mallu Bhatti Vikramarka
Congress
BJP

More Telugu News