'మేమంతా సిద్ధం' పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

  • ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఎన్నికల సమరశంఖం పూరిస్తున్న సీఎం జగన్
  • మేమంతా సిద్ధం యాత్రలో ప్రొద్దుటూరులో మొదటి సభ
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమరశంఖం పూరిస్తున్నారు. 'మేమంతా సిద్ధం' పేరిట సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. 'మేమంతా సిద్ధం' యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహించనున్నారు. 

యాత్ర ప్రారంభానికి ముందు సీఎంజగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారు. 

ఇక, మార్చి 28న నంద్యాలలో, మార్చి 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 

YS Jagan
Memantha Siddham
Election Campaign
YSRCP
Andhra Pradesh

More Telugu News