160కి పైగా సీట్లు వస్తాయి: చంద్రబాబు
- లోక్ సభలో ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయన్న చంద్రబాబు
- ఈ సాయంత్రం 11 మంది టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- పెండింగ్ లో 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు
మరోవైపు ఈరోజు కొంత మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 114 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్ సభ అభ్యర్థులను మాత్రం ఆయన ఇంత వరకు ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం 11 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.