ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు
- కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశానన్న మాజీ డీఎస్పీ
- రెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి
- ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు
కేసు ప్రాధాన్యం దృష్ట్యా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేవలం ఫిర్యాదుదారులు మినహా ఇతరులను స్టేషన్ లోకి అనుమతించడంలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారించారు. హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలోనే విచారణ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపైనే అధికారులు పలు ప్రశ్నలు సంధించి, ప్రణీత్ నుంచి జవాబులు రాబట్టారట. ప్రణీత్ తో పాటు ఆయనతో కలిసి పనిచేసిన అధికారులనూ ఈ బృందం విచారణకు పిలిపిస్తోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రణీత్ మాజీ కొలీగ్ ను సోమవారం విచారించినట్లు అనధికారిక వర్గాలు వెల్లడించాయి. మరికొందరిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.