వస్తున్నా... వచ్చేస్తున్నా... ప్రజాగళం సభకు బయల్దేరుతూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

  • ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు 
  • బొప్పూడి వద్ద ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభ
  • హాజరవుతున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం ఎన్నికల సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతున్నారు. ఈ సభకు బయల్దేరుతూ మోదీ ట్వీట్ చేశారు. 

"ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరాను. ఈ సాయంత్రం పల్నాడులో చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారితో కలిసి ఎన్డీయే సభకు హాజరవుతున్నాను. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి, అభివృద్థి దిశగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల దీవెనలు కోరుతోంది" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Narendra Modi
Praja Galam
Boppudi
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News