ఎన్నికల షెడ్యూల్ పై సింగిల్ లైన్ ట్వీట్ చేసిన ఏపీ సీఎం జగన్

CM Jagan tweets on elections schedule
  • ఎన్నికల షెడ్యూల్  ప్రకటించిన ఈసీ
  • ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • సిద్ధం అంటూ సమరశంఖం పూరించిన సీఎం జగన్
  • ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ హ్యాష్ ట్యాగ్
కేంద్ర ఎన్నికల సంఘం నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ఏపీలో మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఏక వాక్యంతో ట్వీట్ చేశారు. "2024 మే 13... సిద్ధం" అని సమర శంఖారావం పూరించారు. అంతేకాదు, ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. సీఎం జగన్ ఇవాళ ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Jagan
Siddham
Elections Schedule
YSRCP
Andhra Pradesh

More Telugu News