ధూమపానం అలవాటు ఉన్నవారిలో స్ట్రోక్ ముప్పు అధికం
- ధూమపానం అలవాటు, స్ట్రోక్ మధ్య సంబంధంపై అధ్యయనంలో వెలుగులోకి కీలక విషయాలు
- ఫిల్టర్ చేసిన, ఫిల్టర్ చేయని సిగరెట్లు రెండూ ప్రమాదమే
- స్మోకింగ్ అలవాటు లేకపోయినా వారానికి 10 గంటల పాటు పొగాకు ఉత్పత్తుల పొగకు గురైతే రెట్టింపు దుష్ప్రభావం
- హెచ్చరించిన తాజా అధ్యయనం
స్మోకింగ్ అలవాటు లేకపోయినా వారానికి 10 గంటల పాటు పొగాకు ఉత్పత్తుల పొగకు గురయ్యేవారిలో స్ట్రోక్ ప్రమాదం దాదాపు రెట్టింపుగా ఉంటుందని పేర్కొంది. మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం కారణంగా సంభవించే ఇస్కిమిక్, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం అధికంగా ఉందని తెలిపింది. ముఖ్యంగా ప్రతి రోజూ 20 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చే అలవాటున్న 50 ఏళ్లలోపు వయసు వారిలో రిస్క్ ఎక్కువని అధ్యయనం హెచ్చరించింది. భౌగోళికంగా చూస్తే పశ్చిమ యూరోపియన్ దేశాలు, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ధూమపానం చేసేవారికి స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది.