కవిత కేసు విషయంలో... ఢిల్లీలో అడ్వొకేట్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్న కేసీఆర్
- సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు
- ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతోనూ మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధిష్ఠానం
- కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు ఢిల్లీలోనే అడ్వొకేట్ల టీమ్
ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వొకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు... ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో న్యాయవాదుల టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు.