కవిత అరెస్ట్‌పై న్యాయవాది సోమా భరత్ తీవ్ర ఆగ్రహం
- సుప్రీంకోర్టులో చెప్పిన దానికి భిన్నంగా ఈడీ అరెస్ట్ చేసిందని మండిపాటు
- ఎలాంటి వారెంట్ లేకుండా ఓ మహిళను అరెస్ట్ చేయడం అక్రమమే అవుతుందని వ్యాఖ్య
- అక్రమ అరెస్ట్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తామన్న న్యాయవాది
మహిళలు, పిల్లలను అరెస్ట్ చేసే సమయం... వారిని విచారించే సమయం గురించి ఇప్పటికే కవిత పోరాడుతున్నారని... దీనిపై త్వరలో సుప్రీంకోర్టులో తీర్పు రానుందని... ఇలాంటి సమయంలో ఆమె అరెస్ట్ ఘోరం... అన్యాయమన్నారు. ఈ అక్రమ అరెస్ట్‌పై తాము న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. కాగా, ఈడీ అధికారులకు సహకరిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఈ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని చెప్పారు.