రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు
- కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానన్న మెగా డాటర్
- రాసిడన్ బ్లూ పబ్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న నిహారిక
- బిల్లు కట్టి బయటకు వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడి
రాడిసన్ బ్లూ పబ్ సంఘటనపై..
"రాసిడన్ బ్లూ పబ్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. నేను పబ్బులకు, పార్టీలకు చాలా తక్కువగా వెళ్తుంటాను. ఆరోజు నేను అక్కడ మా స్కూల్ ఫ్రెండ్స్‌ను కలిశాను. ఆరు నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా అనిపించడంతో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మీడియాలో ఎందుకింత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. తర్వాత అక్కడెవరో డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను" అని నిహారిక చెప్పింది.