Mithun Reddy: ఆ అన్ని పార్టీల్లోనూ చంద్రబాబు మనుషులే!: ఎంపీ మిథున్ రెడ్డి
ఏపీలో రాజకీయ పొత్తులపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పార్టీల్లోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన సీట్లలో 11 చోట్ల టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తరపున పోటీ చేసేది కూడా వాళ్లేనని అన్నారు. కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవర్టేనన్న ఆయన.. అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు. వాలంటీర్లను తొలగిస్తారని కూడా చెప్పారు.