K Kavitha: ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు... తండ్రి ఆశీర్వాదం తీసుకున్న కూతురు

  • కవిత పుట్టినరోజును పురస్కరించుకొని ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు
  • సోషల్ మీడియాలో కవితకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కవిత కృతజ్ఞతలు
Kavitha takes blessings of KCR

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్‌ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత... తన తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. సోషల్ మీడియాలో కవితకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News