నేను లోకల్.. వినోద్ నాన్ లోకల్: బండి సంజయ్
- ఏపీలో ఏడు మండలాలను కలిపిందే కేసీఆర్ అన్న సంజయ్
- నీ పార్టీలో తెలంగాణ పదమే లేదని విమర్శ
- నువ్వు నిజాయతీపరుడివా అంటూ వినోద్ కు ప్రశ్న
నువ్వు నిజాయతీపరుడివా? అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. నిజాయతీపరుడివైతే ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని భూములు ఎందుకు కాజేశారని అడిగారు. తాను లోకల్... వినోద్ నాన్ లోకల్ అని అన్నారు. స్మార్ట్ సిటీ కోసం తొలుత వెంకయ్య నాయుడిని కలిసింది తానేనని... అయితే, తనకు పేరు రాకుండా చేశారని విమర్శించారు.