హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీ
- బీజేఎల్పీ నేతగా నాయబ్ సైనీని ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు
- మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో తెరపైకి నాయబ్ సైనీ
- కురుక్షేత్ర ఎంపీగా ఉన్న నాయబ్ సైనీ
నాయబ్ సైనీ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. గత ఏడాది బీజేపీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 1996 నుంచి బీజేపీలో క్రమంగా ఎదిగారు. 2002లో బీజేపీ అంబాలా జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలా జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేపీ హర్యానా రాష్ట్ర కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో నారాయణగఢ్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2016లో మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో చేరారు. 2019లో కురుక్షేత్ర నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. 2023లో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది.