నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
  • 616 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 160 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేంత వరకు నష్టపోతూనే వచ్చాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, కీలక రంగాల్లో అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 616 పాయింట్లు నష్టపోయి 73,502కి పడిపోయింది. నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 22,332 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.05%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.83%), బజాజ్ ఫైనాన్స్ (0.29%), టీసీఎస్ (0.28%), ఏసియన్ పెయింట్ (0.25%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ (-2.53%), టాటా స్టీల్ (-2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.53%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.34%).

Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News