Viral Videos: మెరుపు వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టిన కారు.. అమాంతం గాల్లోకి లేచి కిందపడి ఇద్దరి మృతి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

  • ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఘటన
  • నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను ఢీకొట్టిన కారు
  • ఘటనా స్థలంలోనే ఇద్దరి మృతి
  • ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరొకరు
 2 dead as speeding car tosses them into air in Uttar Pradesh Gorakhpur Here Is Video

పట్టపగ్గాల్లేని వేగంతో దూసుకొచ్చిన ఓ కారు రోడ్డుపై మాట్లాడుకుంటూ నిదానంగా వెళ్తున్న పాదచారులను ఢీకొట్టింది. ఆ వేగానికి పాదచారులు ఇద్దరూ అమాంతం గాల్లోకి లేచి ఆపై అంతేవేగంతో కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు రాత్రివేళ రోడ్డు పక్కగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో మెరుపువేగంతో దూసుకొచ్చిన ఓ కారు వారిని అమాంతం ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఆ వేగానికి బాధితులు గాల్లోకి అంతెత్తున ఎగిరి రోడ్డుపై పడ్డారు. బాధితులను మొయీన్, అకీల్ అహ్మద్, తాహిర్‌గా గుర్తించారు. మొయీన్, అకీల్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా తాహిర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును, డ్రైవర్‌ను ఇంకా గుర్తించలేదని, దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.

More Telugu News